సాక్షి, హైదరాబాద్: ఏపీలో ఉద్యోగులకు ఐఆర్ ఇచ్చి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వారికి అండగా నిలిచారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ గురువారం తెలిపారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో ఉద్యోగ సంఘాల నేతలు.. పదవులకు కక్కుర్తి పడి ఉద్యోగులను మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఉద్యోగ సంఘాల నేతలు ఉద్యోగులను పణంగా పెట్టి పదవులు దక్కించుకున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం బెదిరింపు చర్యలకు పాల్పడుతుందని అన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం కుమ్మక్కై సీఏఏ పై అనవసర రాద్దాంతం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మార్చి 15 న హైదరాబాద్ ఎల్‌బీ స్టేడియంలో జరగనున్న బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారని లక్ష్మణ్ వెల్లడించారు.